వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు
1 min read– వినాయక విగ్రహాల కు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి,
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల వ్యాప్తంగా వినాయక చవితి పురస్కరించుకొని ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద బుధవారం ప్రజలు, విగ్రహాల నిర్వాహకులు వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, పలువురు ప్రజా ప్రతినిధులు వినాయకుని మంటపాలు సందర్శించిపూజలు నిర్వహించారు, చెన్నూరు మండలం రామన పల్లి గ్రామంలో కొలిమి వీధి, గణపతి నగర్ లో శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక 2వ వార్షికోత్సవం సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, స్వామివారికి ప్రత్యేక పూజలు తోపాటు మధ్యాహ్నం 24 వంటకాలతో గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది . కే ఓ ఆర్ నగర్లో ఎల్లమ్మ దేవాలయం వద్ద వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటలకు, కే ఓ ఆర్ కాలనీలోని ఎల్లమ్మ దేవాలయం వద్దగల వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు,చెన్నూరు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నూరు బెస్త కాలనీ, లక్ష్మీ నగర్, సరస్వతి నగర్, కొత్త గాంధీనగర్, అరుంధతి నగర్, ప్రాంతాల్లో వినాయకునికి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నూరు లో పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఊరేగింపు నిర్వహిస్తూ విగ్రహాలను చెన్నూరు హైవే వంతెనపై నుంచి పెన్నా నది లోకి నిమజ్జనం చేశారు.