రైతులకు అందుబాటులో ఆహార ధాన్యాల పరీక్షా ల్యాబ్స్
1 min read– 50 కిలోమీటర్లలో, నిల్వలకు 100 కిలోమీటర్ల లో ఉండాలి..
– రైతులకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయాలి..
– రైతుల సమాచారానికి ఎఫ్ సి ఐ వెబ్ సైట్ లో ప్రచురణ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : వరి, గోధుమలు మరియు ఇతర ఆహార ధాన్యాల పరీక్షల కోసం రైతులకు అందుబాటులో ఉండే ఆహార ధాన్యాల పరీక్షా ల్యాబ్ డేటా బేస్ను 50 కిలోమీటర్ల లోపు మ్యాప్ చేయాలని మరియు రైతులు వారి ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుచేత, రైతులందరూ భౌతిక ప్రమాణాలు అయినటువంటి తేమ, సేంద్రీయ మరియు అసేంద్రియ వ్యర్థ పదార్థం, పురుగులు, అపరిపక్వత, దెబ్బతిన్న, రంగు మారిన మొదలైనవి నిర్ధారించడానికి ఎఫ్ సి ఐ యొక్క సమీప ఆహార పరీక్ష ల్యాబ్ ను సంప్రదించవలసిందిగా ఒక ప్రకటనలో తెలియపరచడమైనది. రైతుల ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని మరియు ఆహార ధాన్యాల పరీక్షల కోసం రైతులకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయాలని కూడా నిర్ణయించడమైనది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ల జాబితా సమాచారం www.fci.gov.in వెబ్సైట్ లో ప్రచురించబడింది.