NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌ల్కాన్ గిరిలో ఫుడ్ పాయిజ‌న్..115మందికి అస్వస్థత !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఒడిశాలోని మాల్కాన్ గిరి జిల్లా పోడియం మండ‌లం కుర్తి గ్రామంలో ల‌స్సీ తాగి 115 మంది అస్వస్థత‌కు గుర‌య్యారు. వీరిలో 21 మంది చిన్నారులు ఉన్నారు. కుర్తి గ్రామంలో వారాంత‌పు సంత జ‌రుగుతుంది. ఈ సంత సంద‌ర్భంగా గ్రామ‌స్థులు ఓ దుకాణంలో ల‌స్సీ తాగారు. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా 115 మంది అస్వస్థత‌కు గుర‌య్యారు. దీంతో పోడియం ఆరోగ్య సిబ్బంది వీరికి చికిత్స అందించారు. కొంద‌రిని పోడియం మండ‌ల కేంద్రానికి త‌ర‌లించ‌గా.. మిగిలిన వారిని కుర్తి గ్రామంలోనే చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగానే కుర్తి గ్రామ‌స్థులు అస్వస్థత‌కు గుర‌య్యార‌ని స్థానిక వైద్యులు తెలిపారు.

About Author