PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

14 మంది విద్యార్థులకు.. ఏడుగురి టీచర్లకు..

1 min read
కస్తూరిబా హాస్టల్​ విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

కస్తూరిబా హాస్టల్​ విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

– ఆదోని కరోనా విజృంభన
పల్లెవెలుగు వెబ్​, ఆదోని: కరోనా సెకండ్​ సెవ్​ విజృంభిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోనిలో కరాళ నృత్యం చేస్తున్నా.. ప్రజలు పట్టించుకోవడంలేదు. దీంతో ఒక్కసారిగా కేసులు పదుల సంఖ్యలో బయట పడుతున్నాయి. పట్టణంలోని కస్తూర్పా హాస్టల్​లో గురువారం 14 మంది విద్యార్థులకు, ఏడుగురి ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్​ వచ్చినట్లు నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్​ రామకృష్ణ, మున్సిపల్​ కమిషనర్​ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్​ రంగ నాయకులు కస్తూర్బా హాస్టల్​కు చేరుకుని మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. హాస్టల్​లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. హాస్టల్​ ఆవరణం చుట్టూ శానిటైజర్​, పౌడర్​ చల్లించారు.

About Author