7 రోజులకు.. రూ.50లక్షల అద్దె
1 min readపల్లెవెలుగు వెబ్: నెలకు రూ.5 వేలు, రూ.6 వేల అద్దె అంటే.. మధ్య తరగతి ప్రజానీకం అమ్మో ఐదు వేలా..! అంటారు. వచ్చే చాలీచాలని జీతంతో ఐదారు వేలు అద్దె కట్టాలంటే.. జేబు గుల్లవుతుంది. అలాంటిది ఓ కోటిశ్వరుడు నెలకు 2 కోట్ల అద్దె చెల్లిస్తున్నాడు. అంటే.. వారానికి 50 లక్షలు అన్న మాట..!. ఇంతకీ అతనెవరు.. ఎక్కడో తెలుసుకుందాం. కరోనా తర్వాత వ్యాక్సిన్ పేరెత్తితే.. గుర్తొచ్చే పేరు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ప్రపంచంలోనే ఎక్కువ డోసుల వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న సంస్థ. మిలియన్ డోసులు ఏకకాలంలో ఉత్పత్తి చేయగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానం తో నెలకొల్పబడింది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా. ఆయన సుపుత్రుడే అదర్ పూనా వాలా. ఈ అదర్ పూనావాలనే నెలకు 2 కోట్ల అద్దె చెల్లించబోతున్నాడు. లండన్ లోని అత్యంత విలాసవంతమైన ఓ భవంతిని అదర్ పూనావాలా లీజుకు తీసుకున్నారట. ఇందు కోసం ఆయన వారానికి 50 లక్షల అద్దె చెల్లించడానికి సిద్ధమయ్యారట. ఆ విలాసవంతమైన భవంతి కూడ అన్ని రకాల అత్యాధునిక హంగులతో ఉందట. దీంతో ఈ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.