NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెరుగైన పీఆర్​సీ కోసం… పోరాటానికి సిద్ధం.. : ఫ్యాప్టో

1 min read

– 20న కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడికి పిలుపు

 పల్లెవెలుగు వెబ్​ : 11వ పిఆర్‌సి 23% ఫిట్‌మెంట్‌తో అమలు చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్నామన్నారు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యులు.  ఐ.ఆర్‌.27%కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 20న  అన్ని జిల్లాల కలెక్టరు కార్యాలయాల ముట్టడిస్తామని వెల్లడించింది ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యుటియఫ్‌ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో  గురువారం  (13.01.2022)న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో 23% ఫిట్‌మెంట్‌ని వ్యతిరేకిస్తూ ‘‘రౌండ్‌టేబుల్‌’’ సమావేశం జరిగింది. 11వ పిఆర్‌సి ఫిట్‌మెంట్‌ ఐ.ఆర్‌.కంటే ఎక్కువ ప్రకటించాలని, అధికారుల కమిటీ సిఫార్సులను రద్దు చేయాలని, అశితోష్‌మిశ్రా కమిటీ రిపోర్టులను బహిర్గతం చేయాలని,  కేంద్ర ప్రభుత్వ వేతన కమిటీ భవిష్యత్‌లో అమలుకు అంగీకరించమని తెలియజేశారు. సిపిఎస్‌ రద్దు చేయడం తప్ప మరొక అంశాన్ని అంగీకరించమని పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను కొనసాగించాలని, 62 సం॥ల ఉద్యోగ విరమణ వయస్సు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. క్యాంటం పెన్షన్‌ యధావిధిగా అమలు పరచాలని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని,

సచివాలయ ఉద్యోగుల సర్వీస్‌ను అక్టోబర్‌ నుండే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. ఈ డిమాండ్ల సాధనకు ‘‘జనవరి 20వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడి, జనవరి 28వ తేదీన ఛలో విజయవాడ’’ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసారు. అప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ,  పెన్షనర్ల సంఘాలు ఫ్యాప్టో  ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కోరారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్‌ సిహెచ్‌.జోసెఫ్‌ సుధీర్‌ బాబు, సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌.శరతచంద్ర, కో`చైర్మన్లు ఎన్‌. వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ చందోలు వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.ప్రకాష్‌రావు, కోశాధికారి జి.శౌరిరాయలు, కార్యవర్గ సభ్యులు పి.పాండురంగవరప్రసాద్‌, జి.హృదయరాజు, కె.నరహరి, టిఎన్‌యుఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు చండ్ర కృష్ణామోహనరావు, ఏపి పిఇటి &పిడి అసోసియేషన్‌ బాధ్యులు సిహెచ్‌.కొండయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author