PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుక్క‌గా మారడం కోసం రూ. 12 ల‌క్ష‌ల ఖ‌ర్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జపాన్ కు చెందిన ఒక వ్యక్తికి జంతువులా కనిపించాలనేది చిరకాల కోరిక. కుక్కల జాతికి సంబంధించిన కోలీలా మారాలనుకున్నాడు. అయితే అత‌ను జెప్పెట్‌ అనే కంపెనీ ద్వారా తన కోరికను నెరవేర్చకున్నాడు. ఈ కంపెనీ సినిమాలకు, వాణిజ్యప్రకటనలకు, కాస్ట్యూమ్స్‌ అందిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జెప్పెట్‌ కంపెనీని ఆశ్రయించి తన కోరికను వెలిబుచ్చాడు. ఆ కాస్ట్యూమ్స్‌కి సుమారు రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని కంపెనీ చెప్పింది. అంతేకాదు కుక్కలా ఉండే కాస్ట్యూమ్‌ రూపొందిచటానికి కూడా దాదాపు 40 రోజులు పడుతుందని తెలిపింది. తాను రియలిస్ట్‌క్‌ కుక్కలా ఉండాలని కోరుకుంటానని చెప్పి మరీ ఆర్డర్‌ ఇచ్చేశాడు. ఈ మేరకు రూ 12 లక్షలక పైగా ఖర్చుపెట్టి మరీ ఆ కాస్ట్యూమ్‌ని తెప్పించకుని తన కోరికను నెరవేర్చకోవడమే కాకుండా ఆ కాస్ట్యూమ్‌ని ధరించిన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

                                  

About Author