మెరుగైన వైద్య చికిత్సకు.. ఆర్థిక సహాయం : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: వివిధ అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం ప్రశంసనీయమన్నారు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్. మంగళవారం కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 12 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన (8లక్షల 4,500రూపాయలు) చెక్కులను రాయల్ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి … ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక దృష్టిసారించారు. అనారోగ్యానికి గురైన పేదలకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకే సీఎంఆర్ఎఫ్ పథకం అమలు చేస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.