PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శిశు ఆధార్ నమోదుకు.. ట్యాబ్​ పంపిణీ : డీఎంహెచ్​ఓ

1 min read

– డాక్టర్ బి.రామగిడ్డయ్య

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరం,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రామగిడ్డయ్య ఆధ్వర్యంలో శిశు ఆదార్ ( Enrollment ID ) నమోదు కొరకు ” ట్యాబ్ లు పంపిణీ చేశారు.  శనివారం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 3,ఆదోని ఎం సి హెచ్ ఆసుపత్రికి 3, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి 2 పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా బి. రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి శిశువు వివరాలను ట్యాబ్​లో నమోదదు చేయాలని, దీనికొరకు తల్లి లేదా తండ్రి మొబైల్ తో లింక్ కాబడిన ఆధార్ నంబర్ మరియు శిశు జనన వివరాలను ట్యాబ్ నందు పొందుపరచినచో శిశువు ఆదార్ ( Enrollment ID ) జనరేట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ రెండు,మూడు రోజులలో మూడు ఆసుపత్రులలో అందుబాటులోనికి వస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో హేమసుందరం,డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అసిస్టెంట్ ( బర్త్స్ & డెత్స్ ) విజయలక్ష్మి , డిప్యూటీ ఎస్ ఓ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

About Author