PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారి వైద్యచికిత్సకు.. ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగువెబ్​, రాయచోటి : పట్టణంలోని 28వ వార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్​ షేక్​ జాకీర్ కుమార్తె వైద్యచికిత్స కోసం బైపారి మహమ్మద్​ ఖాన్​ రూ.25వేలు ఆర్థిక సహాయం చేశారు. వివరాలిలా ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన జాకీర్ కుమార్తె బోన్​ క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతూ ఉండేది. గతంలో చిన్నారికి ఆపరేషన్​ చేయించినా.. ఫలితం లేకపోయింది. రెండో సారి ఆపరేషన్​ చేయించగా..సక్సెస్​ అయింది. కానీ పాప కోలుకోవాలంటే ఐదు ఇంజక్షన్లు వేయాలని వైద్యులు సూచించడంతో … చిన్నారి తండ్రి జాకీర్​ ఆ వార్డు కౌన్సిలర్​ సలీంను సంప్రదించగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్​ బేపారి మహమ్మద్​ ఖాన్​ను సంప్రదించారు. చిన్నారి కథనం విన్న బైపారి మహమ్మద్​ వెంటనే ఇంజక్షన్ల కోసం రూ. 25వేలు నగదును ఆ పాప తండ్రి జాకీర్​కు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఓ నిస్సార్​ తదితరులు పాల్గొన్నారు.

About Author