PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజకవర్గానికో.. స్కిల్​హబ్​..

1 min read

మొదటి విడతగా 4..

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

ఏలూరు కలెక్టర్ వై. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు, ఏలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించరని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చెప్పారు. అందులో బాగంగా మొదటి విడతగా 4 స్కిల్ హబ్స్ ప్రారంభించగా రెండవ విడతగా 3 స్కిల్ హబ్స్ ప్రారంభిస్తున్నట్లుగా శనివారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్కిల్ హబ్  కరపత్రం  ఆవిష్కరించడం జరిగింది.జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అందరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎస్ ఎస్ డి సి స్కిల్ హబ్ ఆప్ ను విడుదల చేయటం జరిగిందని ఆసక్తి కలిగి అర్హత గల అభ్యర్థులు మొబైల్ అప్లికేషన్ ద్వారా తమ సొంతగా నమోదు చేసుకొవచ్చని లేదా తమ వాలంటీర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని యువతీ యువకులు సధ్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్బంగా డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.విజయ రాజు మాట్లాడుతూ రాష్ట్ర  నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్కిల్ హబ్ లను ఏర్పాటు చేసి 18-30 సంII కలిగిన పదవ తరగతి మరియు ఆపైన చదివిన యువతి యువకులకు 3 నెలల ఉచిత నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇచ్చి తద్వారా స్థానిక సంస్థల నందు  ఉపాది  కల్పించడం జరుగుతుందని శిక్షణా కాలంలో స్టైఫెండ్ కలదని  తెలియజేశారు. జిల్లాలోని స్కిల్ హబ్ లు ఈ క్రింది విదంగా ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు 8978524022 సంప్రదించగలరన్నారు.

 ఈ కోర్సులపై.. ఉచిత శిక్షణ:

స్కిల్ హబ్ కోర్సు వివరములు తెలుపుతూ ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాల, సత్రంపాడు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ , ప్రభుత్వ జూనియర్ కాలేజి, బుట్టాయిగూడెం సెల్ఫ్ ఎంప్లొయడ్ టైలర్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్,ప్రభుత్వ జూనియర్ కాలేజి, కైకలూరు    అకౌంట్ ఎగ్జిక్యూటివ్  ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ,శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ, భీమడోలు అకౌంట్ ఎగ్జిక్యూటివ్ మరియుడొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజి రావు, జే.డి.ఎం. పార్ధ సారధి  పాల్గొన్నారు.

About Author