కరోన టెస్టుల కోసం .. రెండేళ్లలో ఎంత ఖర్చు పెట్టారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన కారణంగా నిర్ధారణ పరీక్షలకు పెద్ద ఎత్తన జనం డబ్బు ఖర్చు పెట్టారు. కొవిడ్ లక్షణం ఏ ఒక్కటి కనిపించినా.. జనం తీవ్ర ఆందోళనతో కొవిడ్ పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఆయా ల్యాబ్‌లు ఎంత చెబితే అంత చెల్లించి పరీక్షలు చేయించుకున్నారు. ఇలా గడచిన రెండేళ్లలో కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు రూ.74 వేల కోట్లు ఖర్చు చేసినట్లు గ్రాహక్ భారతి అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అయితే ఇందులో దాదాపు 74 కోట్ల టెస్టులను ఎటువంటి అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్‌లే చేశాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో చాలా మంది తమకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కొవిడ్ టెస్టు చేయించుకున్నారు. వారి ఆందోళనను ఆసరాగా చేసుకున్న ల్యాబ్‌లు.. ఒక్కో టెస్టుకు రూ.3500 దాకా వసూలు చేశాయి.