PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోనా వైరస్​కు.. ఈ ఆహారంతో చెక్​..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన వైర‌స్ మాన‌వ జీవ‌న‌శైలిని మార్చేసింది. గ‌త 100 సంవత్సరాల్లో రాని మార్పు క‌రోన త‌ర్వాత వ‌చ్చింది. శుభ్రత‌, ఆహార ప‌దార్థాల వినియోగం లాంటి కీల‌క‌మైన విష‌యాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. కొన్ని చిట్కాల‌ను పాటిస్తే.. క‌రోనతో పాటు ఇత‌ర వైర‌స్ లు మ‌న‌లో చొర‌బ‌డ‌కుండా చూసుకోవ‌చ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.

  • ప‌రిస‌రాలు ఎప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసే సమ‌యంలో, వంట చేసిన త‌ర్వాత చేతులు శుభ్రంగా క‌డ‌గాలి. వంట‌గ‌ది నిరంతరం శుభ్రంగా ఉంచుకుంటూ.. కీట‌కాలు, జంతువులు వంట గ‌దిలోకి రాకుండా చేయాలి. వంట సామాగ్రి, మ‌సిగుడ్డ, మ‌న చేతుల్లో ఉన్న వైర‌స్ లు ఆహారంలోకి వెళ్లి.. ఆహార‌ప‌దార్థాల ద్వార వ్యాధులు రావొచ్చు. టాయిలెట్ కు వెళ్లి వ‌చ్చిన ప్ర‌తిసారి చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి.
  • ప‌చ్చిగా ఉన్న ప‌దార్థాలు, వండిన ప‌దార్థాల‌ను దూరంగా ఉంచాలి. రెండిటి మ‌ధ్య దూరం ఖ‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. పచ్చి ప‌దార్థాల‌లో వివిధ సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిని వండిన ప‌దార్థాల వ‌ద్ద ఉంచితే.. అందులోని సూక్ష్మిక్రిములు వండిన ప‌దార్థాల‌లోకి వెళ్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప‌చ్చి మాంసం, చేప‌లు, రొయ్యలు లాంటి ఆహార‌ప‌దార్థాల‌ను వండిన ఆహారానికి దూరంగా ఉంచాలి. అలా ఉంచితే.. ప‌చ్చి మాంసంలో ఉన్న సూక్ష్మి క్రిములు వండిన ఆహారంలోకి చేర‌వు.
  • మాంసం, గుడ్లు, చేప‌లు లాంటి మాంసాహారాన్ని బాగా ఉడికించాలి. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వ‌ద్ద వీటిని వేడిచేయాలి. ఫ‌లితంగా ఏవైనా సూక్ష్మజీవులు ఉంటే చ‌నిపోతాయి. అలాగే చ‌ల్లారిన ఆహారాన్ని తినే ముందు వాటిని బాగా వేడి చేసిన త‌ర్వాత తినాలి. వండిన ఆహారాన్ని బ‌య‌టి వాతావ‌ర‌ణంలో 2 గంట‌ల‌కు మించి ఉంచ‌రాదు. నిర్ణీత ఉఫ్ణోగ్రత‌ల వ‌ద్ద ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ లో కూడ ఎక్కువ సేపు ఉంచ‌రాదు.
  • ఫ్రోజెన్ ఆహార ప‌దార్థాల‌ను సాధార‌ణ ఉష్ణోగ్రతల వ‌ద్ద రూంలో ఉంచరాదు. ప‌రిశుభ్రమైన నీరు వాడాలి. వంట‌కు ప‌రిశుభ్రమైన నీరు వాడాలి. పండ్లు , కూర‌గాయ‌లు బాగా క‌డ‌గాలి. గ‌డువు ముగిసిన ఆహార ప‌దార్థాలు తిన‌రాదు. పాల‌ను ఫాశ్చురైజేష‌న్ చేయ‌కుండా తాగ‌రాదు. పైన చెప్పిన చిట్కాల‌ను పాటిస్తే ఎలాంటి వైర‌స్ లు , వ్యాధులు మ‌న వ‌ద్దకు రావు.

About Author