NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులైన జంటలకు …వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

1 min read

-ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వర్తింపు

– ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  ఈ ఏడాది ఏప్రిల్‌ –  జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అర్హులైన జంటలకు అమలైనట్లు ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, ఏపిఎం గంగాధర్ లు తెలిపారు, బుధవారం వారు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైయస్సార్ షాది తోపా, వైయస్సార్ కళ్యాణమస్తు కు సంబంధించి బుధవారం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు,  మండల వ్యాప్తంగా దీని ద్వారా  వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయ నున్నట్లు వారు తెలిపారు, పేద తల్లిదండ్రులు పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యతకు అండగా నిలుస్తూ,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’ ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్నదని వారు తెలియజేశారు, ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప శుభ పరిణామమని ఎంపీడీవో తెలియజేశారు.

About Author