ఇంజినీరింగ్ కోర్సుకు.. ఇంటర్ మ్యాథ్స్ తప్పనిసరి కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ లో మ్యాథ్స్‌ను తప్పనిసరిగా చదివుండాలనే నిబంధనను అఖిల భారత సాంకేతిక విద్యామండలి మార్పు చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించిన మొత్తం 29 డిప్లొమా / యూజీ కోర్సుల్లో 10 కోర్సులను మ్యాథ్స్ అర్హత నుంచి మినహాయించింది. ఈ మేరకు 2022-23 విద్యాసంవత్సరానికి నూతన మార్గదర్శకాలను ఏఐసీటీఈ ప్రకటించింది. వీటిని అనుసరించి… డిగ్రీలో ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులు చేయడానికి మ్యాథ్స్ చదివుండటం తప్పనిసరి కాదు. అలాగే పలు కోర్సులకు కెమిస్ట్రీని కూడా మినహాయించింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ కోర్సులు చేయాలంటే ఇంటర్‌లో కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివుండాల్సిన అవసరం లేదు.