PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూర్ఛవ్యాధిగ్రస్తులకు… 14న ఉచిత వైద్యశిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్​,కర్నూలు: అంతర్జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన (సోమవారం) కర్నూలు హార్ట్​ అండ్​ మల్టీ స్పెషాలిటీ  హాస్పిటల్​లో ఉచిత ఎపిలెప్సీ క్యాంప్​ ( ఉచిత వైద్యశిబిరం) నిర్వహించనున్నట్లు ప్రముఖ నరముల వైద్యనిపుణులు డా. కె. హేమంత్​ కుమార్​ ఎండి,డీఎం తెలిపారు.  గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత ఎపిలెప్సీలో భాగంగా వ్యాధి నిర్ధారణ కోసం ఈఈ టెస్ట్​ చేస్తామని, అదేవిధంగా కన్సల్టేషన్​ ఉచితంగా ఉంటుందన్నారు. కర్నూలు నగరం, ఏక్యాంప్​లోని కొత్త అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరున్న కర్నూలు హార్ట్​ అండ్​ మల్టీ స్పెషాలిటీ  హాస్పిటల్​లో  సోమవారం ఉదయం 10 గంటలకు ఎపిలెప్సీ క్యాంప్​ ప్రారంభమవుతుందని, శిబిరానికి వచ్చే వారు  సెల్​.9441094410కు ఫోన్​ చేసి పేర్లు రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని సూచించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  నరముల వైద్యనిపుణులు​ డా. హేమంత్​ కుమార్​ కోరారు.

About Author