ఫిక్స్డ్ డిపాజిట్లకు.. అత్యధిక వడ్డీ ఏపీజీబీలోనే…
1 min read– ఏపీజీబీ చైర్మన్ రాకేష్ కశ్యప్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఖాతాదారుల ఆలోచనకనుగుణంగా… ఫిక్సడ్ డిపాజిట్లకు అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అని పేర్కొన్నారు ఏపీజీబీ చైర్మన్ రాకేష్ కశ్యప్. ఏపీజీబీ కర్నూలు రీజనల్ పరిధిలోని 12 శాఖలకు సంబంధించి ‘ ఎలైట్ కస్టమర్స్’ యొక్క మీటింగ్ మంగళవారం అపోవ సదన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏపీజీబీ చైర్మన్ రాకేష్ కశ్యప్ మాట్లాడుతూ డిపాజిట్ల సేకరణ మహోత్సవం సందర్భంగా ప్రగతి ధనలక్ష్మి అనే కొత్త పథకం ద్వారా 777 రోజుల కాల పరిమితికి 6.30 శాతం వడ్డీని సీనియర్ సిటిజన్లకు మరియు 666 రోజుల కాల పరిమితికి 6.20 శాతం వడ్డీని సీనియర్ సిటిజన్జలకు ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా హౌసింగ్, గోల్డ్, కారు… తదితర లోన్లను ఏపీజీబీలో పొందవచ్చని ఈ సందర్భంగా ఆ బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ స్పష్టం చేశారు.
అనంతరం ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయం మేనేజర్ పి. ఓబయ్య మాట్లాడుతూ క్రాప్, హౌసింగ్ తదితర రుణాలను తక్కువ కాల పరిమితితోనే మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అపోవ ప్రెసిడెంట్ యుగంధర్, ప్రాంతీయ కార్యాలయం చీఫ్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, సీనియర్ మేనేజర్స్ మరియు వివిధ శాఖల మేనేజర్లు, వినియోగదారులు పాల్గొన్నారు.