జగన్ కు రథసారధులు మహిళలే..
1 min readమహిళల ఆర్థికాభివృద్దే జగన్ ప్రభుత్వ ధ్యేయం..
వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాలకు బాసట.
మాట ఇచ్చారు… డ్వాక్రా రుణాలును పూర్తిగా మాపీ చేశారు.
ఆసరా ద్వారా నందికొట్కూరు నియోజక వర్గంలో నాలుగు విడతల్లో మాపీ అయిన మొత్తం:రూ 27,31,50, 234.
పండుగ వాతావరణంలో జరిగిన నాల్గవ విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్ కు ప్రచార సారథులు మహిళలేనని అక్క చెల్లెమ్మలలు, పేదలు,ప్రజలు జగన్ కు అండగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి బాసటగా నిలవాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. సోమవారంమండల కేంద్రమైన నందికొట్కూరు లో జరిగిన మండల వైఎస్ఆర్ ఆసరా నాల్గవ విడత సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పాల్గొన్నారు.ఎంపిపి మురళి కృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతు న్నారన్నారు. ఎన్నికల సమయానికున్న డ్వాక్రా రుణాలను నాలుగువిడతలుగా మాపీ చేస్తామని చెప్పి నేటికి సంపూర్ణంగా ఆ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారన్నారు.వైఎస్ ఆర్ ఆసరా ద్వారా నందికొట్కూరు నియోజక వర్గంలో నాలుగు విడతల్లో 4077 సంఘాలలో రూ.27,31,50,234 మాపీ అయ్యిందన్నారు. నందికొట్కూరు మండలంలో వైఎస్ఆర్ నాల్గవ విడత క్రింద 695 సంఘాలకు రూ 5,15,85,811 లబ్ది చేకూరిందన్నారు.
మంచి జరిగివుంటేనే జగన్ కు అండగా నిలవాలి.
సీఎం జగన్ ప్రతి కుటుంబానికి మేలు చేశారు.ప్రతి ఇంటికీ రెండో, మూడో పథకాలు అందించారు.ఆర్థికంగా ఆదుకుని పేదల కుటుంబాలలో వెలుగులు నింపారన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.50 లక్షల కోట్లనిధులను ప్రజల ఖాతాలలో జమ చేయడం ఒక చరిత్ర అని న్నారు.అమ్మఒడి కి రూ 30 వేల కోట్లు,చేయూత కు రూ, 25 వేల కోట్లు,చేయూత ద్వారా రూ ,18 వేల కోట్లు, విద్యాదీవెన, వసతి దీవెన ల ద్వారా రూ, 22 వేల కోట్ల నిధులును సీఎం జగన్ అందించారన్నారు. పెన్షన్ల కోసం రూ, 1 లక్ష కోట్లను జగన్ ప్రభుత్వం వ్యయం చేయడం ఒక రికార్డ్ అని అన్నారు.33 లక్షల మందికి పక్కా గృహాలు ను మంజూరు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు అధికారంలోనుంచి దిగిపోయేటప్పుడు రూ, 3.50 లక్షల కోట్లను అప్పులుగాను, రూ 80 వేల కోట్ల రూపాయలను పెండింగ్ బకాయిలు పెట్టి వెళ్లారని, జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత రెండేళ్లు కరోనా తో ఆర్థిక ఇబ్బందులు వున్నా ఈ విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందచేయడం జగన్ పరిపాలన దక్షతకు నిదర్శనమన్నారు.
చంద్రబాబు పాలనలో దగా పడ్డ మహిళలు..
టీడీపీ మ్యానిఫెస్టో అపద్దాల పుట్టగా ఉందన్నారు 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చెప్పిన హామీలను నెరవేర్చలేదన్నారు.అదే వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నాలుగన్నరేళ్ళ పాలనా కాలంలో 99 శాతం నెరవేర్చి మాటమీద నిలబడే వ్యక్తిగా పేరొందాన్నారు. మీ ఇళ్ల దగ్గరికి వచ్చే టి డి పి నాయకులను టి డి పి హయాంలో ఎన్నెన్ని హామీలు నెరవేర్చారో ప్రజలు ప్రశ్నించాలన్నారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలను,బంగారు రుణాలను బేషరతుగా మాపీ చేస్తామని చెప్పి అందరినీ నిలువునా మోసాగించారన్నారు.అదే జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఆదర్శ ముఖ్య మంత్రిగా నిలిచారన్నారు.చంద్రబాబు మాయ మాటలతో ప్రజలలోకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలును ప్రజలే తిప్పికొట్టాలన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా నాల్గవ విడతలో నందికొట్కూరు మండలం లోని 695 సంఘాలకు రూ. 5,15,85,811 కోట్లు విలువ చేసే మెగా చెక్ ను ప్రజా ప్రతినిధులుతో కలసి అందచేశారు. కార్యక్రమంలో నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డా.ధార సుధీర్, ఎంపీడీఓ నరేష్ కృష్ణ , జడ్పీటీసీ కలిమున్నీసా , వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ రాహాత్ , వైసీపీ మండల కన్వీనర్ బిజీనవేముల సర్పంచి రవియాదవ్, వివిధ గ్రామాల వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు , గ్రామ నాయకులు కార్యకర్తలు, అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.