NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీసాలు తీయ‌నందుకు.. ఉద్యోగి స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మీసాలు ట్రిమ్ చేయ‌నందుకు మ‌ధ్య‌ప్రదేశ్ లో ఓ ఉద్యోగి పై స‌స్పెన్ష‌న్ వేటు పడింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన రాకేష్ రానా పోలీసు శాఖ‌లో ఉద్యోగిగా ఎంపికయ్యారు. విధుల్లో ఉండ‌గా.. మీసాలు ట్రిమ్ చేయాల‌ని ఉన్న‌తాధికారులు ఆదేశాలిచ్చారు. అయితే రాకేశ్ రానా ఆ ఆదేశాలు భేఖాత‌రు చేశారు. దీంతో నిబంధ‌న‌లు పాటించ‌నందుకు కానీ.. అత‌డిని పోలీసులు స‌స్పెండ్ చేశారు. అయితే దీని పై రాకేష్ రానా స్పందించారు. త‌ను రాజ్ పుత్ వంశం నుంచి వ‌చ్చాన‌ని, మీసాలు ఉండ‌ట‌మే త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు. ఉద్య‌గప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని తెలిపారు. త‌న‌ను స‌స్పెండ్ చేసినా ఫ‌ర్వాలేదు కానీ మీసాల విష‌యంలో రాజీప‌డే ప్ర‌సక్తేలేద‌ని తేల్చారు.

                                                 

About Author