స్పందనకు..35 ఫిర్యాదులు..
1 min readత్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎస్ పి హర్ష వర్ధన్ రాజు
పల్లెవెలుగు వెబ్, రాయచోటి:అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు.నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను అధేసించారు. ఎస్పీ గారు నిర్వహించిన స్పందనకు 35 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ గారు స్వయంగా స్వీకరించారు. పిర్యాదుదారులతో ఎస్పీ గారు ముఖాముఖీ మాట్లాడి వారి పిర్యాధుల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.ఎస్పీ గారు అందిన ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చట్టప్రకారం విచారణ జరిపి పిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించేలా కృషి చెయ్యాలని ఆదేశించారు.