విత్తనాల కోసం..ఆర్బీకేలో రిజిస్ర్టేషన్ ప్రారంభం
1 min read– ఏఓ రాజా కిశోర్
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల: రైతు భరోసా కేంద్రాలలో వేరుశనగ విత్తనం కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని మండల వ్యవసాయ అధికారి రాజా కిషోర్ అన్నారు. ఏఓ విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనం కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. ఒక సెంటు భూమి నుండి 50 సెంట్ల భూమి వరకు పొలం ఉన్న రైతులకు ఒక వేరుశనగ బ్యాగు, 51 సెంట్లు భూమి నుండి ఒక ఎకరం పొలం వరకు ఉన్న రైతులకు రెండు వేరుశనగ బ్యాగులు, ఎకరంపైన అంతకంటే ఎక్కువ పొలం ఉన్న రైతులకు మూడు వేరుశెనగ బ్యాగులు ఇస్తున్నట్లు తెలిపారు. వేరుశనగ విత్తనం పూర్తి ధర 8680 రూపాయలు కాగా,అందులో సబ్సిడీ ధర 3472 రూపాయలు పోగా, రైతు చెల్లించవలసిన ధర 5208 రూపాయలు మాత్రమేనని వెల్లడించారు . రైతు భరోసా కేంద్రంలో పేర్లు నమోదు చేయుటకు రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, చరవాణి నెంబర్ తీసుకొని వచ్చి సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.