NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీమ కోసం.. ష‌ర్మిల ఇంటి వ‌ద్ద అమ‌రావ‌తి రైతుల ధ‌ర్నా

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కృష్ణాజ‌లాల విష‌యంలో ష‌ర్మిల స్పష్టమైన వైఖ‌రి చెప్పాలంటూ అమ‌రావ‌తి జేఏసీ ఆధ్యర్యంలో రైతులు ఆందోళ‌న‌కు దిగారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న నేప‌థ్యంలో.. వైఎస్ షర్మిల తెలంగాణ‌కు మ‌ద్దతుగా ట్వీట్ చేశారు. ష‌ర్మిల చేసిన ట్వీట్ .. రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేసేలా ఉంద‌ని అమ‌రావ‌తి రైతులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. ష‌ర్మిల ఇంటి ముట్టడికి అమ‌రావ‌తి రైతులు ప్రయ‌త్నించ‌డంతో స్వల్ప ఉద్రిక్తత‌కు దారితీసింది. ష‌ర్మిల మ‌ద్దతుదారులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమ‌రావ‌తి రైతుల‌ను పోలీసులు అరెస్టు చేసి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. అమ‌రావ‌తి రైతు జేఏసీ క‌న్వీన‌ర్ కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఆధ్వర్యంలో ఈ ధ‌ర్నా జ‌రిగింది

About Author