PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవకులకు.. సహాయం

1 min read

– నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన లయన్స్​ క్లబ్​
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కరోన వైరస్​తో మృతి చెందిన అనాధలకు అంత్యక్రియలు చేస్తూ… అందరికీ ఆదర్శంగా నిలిచిన బాలాజి, ప్రభాకర్​ బృందాన్ని లయన్స్​ క్లబ్​ రాయచోటి వ్యవస్థాపక అధ్యక్షులు లయన్​ హరినాథ్​ రెడ్డి, సీఐ రాజు అభినందించారు. ఆదివారం రాయచోటి పట్టణం కంసాలవీధి, టుడే ఫ్యాషన్​ దగ్గర సమాజ సేవకులు బాలాజి, ప్రభాకర్​ బృందానికి సీఐ రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ పట్టణంలో కరోనా వైరస్​తో మృతి చెందిన అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం గొప్ప విషయమన్నారు. వైరస్​ ఉందంటే.. ముట్టుకునేందుకు భయపడుతున్న క్రమంలో బాలాజి, ప్రభాకర్​ బృందం ధైర్యంతో అంత్యక్రియలు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు లైన్​ కూన విజయ్​కుమర్​, మున్సిపల్ అధికారి మల్లికార్జున, లయన్స్​ క్లబ్​ సభ్యులు సతీష్ , ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు విద్యాసాగర్, సుమన్ టుడే ఫ్యాషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author