PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల కోసం… కాంక్రీట్ బేడ్డు, బండ పరుపు ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్​: అవోపా ఆధ్వర్యంలో అవోపా సభ్యులు, దాతల సహకారం తో బుధ‌వారం ఉదయం 10:00 గంటలకు కర్నూలు నగరంలోని స్వామి వివేకానంద సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల ఉపయోగం ప్రతినిత్యం ప్రార్థన, మధ్యాహ్నం భోజనం చేయడానికి 40× 40 సైజు లో దాదాపు లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన కాంక్రీట్ బెడ్‌, బండ పరుపు కార్యక్రమం అవోపా అధ్యక్షులు  గోనూరు యుగంధర్ శెట్టి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా యుగంధర్ శెట్టి మాట్లాడుతూ.. దాతల సహకారంతో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు.  చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ స్కూల్లో విద్యతో పాటు దేశ సంస్కృతి కుటుంబ వ్యవస్థ గురించి ఉపాధ్యాయులు చక్కగా వివరిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.  అలాగే దాతలు మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమానికి మేమంతా భాగస్వాములు అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పాఠశాల క‌ర‌స్పాండెంట్ జోగయ్య శర్మ మాట్లాడుతూ.. అవోపా ద్వారా అందిన ఈ సహాయం మరువలేనిదని,  వారికి విద్యార్థులు యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నీలవేణి, దాతలు అందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవోపా కార్యదర్శి పోలేపల్లి శేషయ్య, తుమ్మలపల్లి శ్రీనివాసరావు కొండూరు రవికుమార్, లగిశెట్టి కిషోర్ కుమార్, కాల్వ ప్రసాద్‌,  ఆర్‌వో అవినాష్ శెట్టి, చిన్న నరసింహులు, నాగేళ్ల క‌ల్యాణి, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author