PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 భక్తుల సౌకర్యార్థం.. ‘డయల్ యువర్ ఈఓ’

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: భక్తుల సౌకర్యార్ధం  డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహాయ కమీషనర్ (ఇంచార్జి) మరియు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పి.నటరాజరావు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమము నిర్వహించబడింది. దేవస్థానం పరిపాలనా విభాగములోని సమీక్షా సమావేశ మందిరములో జరిగిన కార్యక్రమములో పలువురు భక్తులు కార్యాలయానికి ఫోన్ ద్వారా పలు సూచనలు, సలహాలు  ఇచ్చారు. ఒంగోలు, గుంతకల్లు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, వెలుగోడు, పశ్చిమగోదావరి జిల్లా తదిర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.  పలువురు భక్తులు స్వామివారి స్పర్శదర్శనం గురించి వివరాలను అడిగారు. అందుకు అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ నివారణ చర్యలో భాగంగా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేసి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతోందన్నారు. నందికొట్కూరు నుంచి ఒక భక్తుడు మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రానికి గల కాలిబాట గురించి పలు సూచనలు చేసారు. వెలుగోడుకు చెందిన ఒక భక్తుడు మాట్లాడుతూ గ్రంథాలయాలకు శ్రీశైలప్రభ చందా చెల్లించు విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

About Author