PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పేలుళ్ల’ మృతులకు.. ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలి

1 min read

– మైనింగ్​ యజమానిని 302 సెక్షన్​ కింద కేసు నమోదు చేయాలి
– అక్రమ బైరటీస్ క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన మల్లెల, రెడ్యం
పల్లెవెలుగు వెబ్​, కడప: జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలోని బైరటీస్ మందుగుండు పేలుళ్ళలో చనిపోయిన మృతుల కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అనుమతి మైనింగ్​ యజమానిపై 302 సెక్షన్​ కింద కేసు నమోదు చేసి, ముగ్గురాళ్లకు సంబంధించిన కోట్ల రూపాయలు నిధులను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆదివారం బైరటీస్​ క్వారీని టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఘటనా వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రెడ్యo, మల్లెల విలేకరులతో మాట్లాడుతూ బైరటీస్ క్వారికి సంబంధించి పర్మిషన్ రద్దు చేసినా మైనింగ్​ అధికారులు సదరు యజమానితో కుమ్మక్కయారని ఆరోపించారు సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్​ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు తదితరులకు సంబంధించి అక్రమ మైనింగ్​పై కోట్ల రూపాయలు జరిమాన విధించారని, బైరటీస్​ మైనింగ్​ కూడా జరిమానా విధించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల సర్పంచ్ యనమల సుధాకర్, బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చెర్మన్ సాధికారి రంతు, మాజీ సర్పంచ్ ఎస్. ఎం. బాషా, మాజీ ఎంపీటీసీ రసూల్,షరీఫ్, వెంకటసుబ్బయ్య, తెదేపా మండలం అధ్యక్షడు రాజీవబాష, ఈమమ్ హుస్సేన్, తిరుమలశెట్టి సుబ్బారావు,గాలి మురళి మోహన్, మామిళ్లపల్లి కొండారెడ్డి,పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

About Author