PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజకవర్గం అభివృద్ధికి.. జనసేన పార్టీ వినతి  

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ను కలిసి జనసేన పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ విద్య, వైద్యం, అభివృద్ధికి సంబంధించి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగాజనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం  నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ,  నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో, విద్యా, వైద్యం, అభివృద్ధికి, నోచుకోవడం లేదని అన్నారు. ఈ సమస్యలపై జాయింట్ కలెక్టర్ గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో గత సంవత్సరం నుంచి టీచర్లు లేకపోవడంతో  విద్యార్థులు జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. స్కూల్లో ఆరు మంది పైగా స్కూల్ నందు టీచర్స్ లేరనీ, కంప్యూటర్ కోర్సు కు సంబంధించిన ఉపాధ్యాయులు లేక  స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరి కొందరు విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే చదువులు ఆగిపోతున్నారని తెలిపారు. మోడల్ స్కూలుకు పిల్లలను పంపలేక టీషులు తీసుకొని వేరే ప్రైవేటు స్కూల్ నందు జాయినింగ్ చేస్తున్నారు, వెంటనే స్కూల్ నందు టీచర్స్ కొరత లేకుండా చూడాలని జాయింట్ కలెక్టరును కోరారు.అలాగే  పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం లేదన్నారు. ముఖ్యంగా పత్తికొండలో 30 పడకల ఆసుపత్రి కావడంతో, చుట్టుపక్కల గ్రామాల వారు పత్తికొండ ఆస్పత్రికి వివిధ రకాల వైద్యం కోసం వస్తున్నారు, రాత్రి సమయంలో వైద్యులు లేక రోగులు అత్యవసర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా అత్యవసరం అయితే, ఆదోని, లేక ,కర్నూలుకు తరలిస్తున్నారు, ఇక్కడ వైద్యం అందక మార్గం మధ్యలో చాలామంది మరణిస్తున్నారు అని పేర్కొన్నారు. స్థానికంగా మరొక సమస్య, పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని, తీసిన డ్రైనేజీ కాలువ ఇంతవరకు పూర్తి చేయకపోవడం ద్వారా, వివిధ షాపులు వారు, ఇంటి లోపలికి వెళ్లే కుటుంబ సభ్యులు, ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా వృద్దులు చిన్నపిల్లలు రాత్రి సమయంలో కాలవలో కింద పడి, ప్రమాదాలు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం పనులు జరగకపోవడంతో తీసిన కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.పత్తికొండ ఆర్డిఓ గారికి కూడా సమస్యలు తెలియజే శామని, కానీ ఇంతవరకు పరిష్కరించలేదని, కావున తమరైనా వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనియెడల జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ నాయకులు నాయకాల బాబ్జి, రెడ్డి పోగు నాగరాజ్, వెంకటేష్, రాఘవేంద్ర, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author