NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆప‌రేష‌న్ కోసం.. నిమ్మర‌సం అమ్ముతోన్న చిన్నారి

1 min read

అమెరికాలోని అలబామా కు చెందిన ఏడేళ్ల లిజా స్కాట్‌కు తరచూ ఫిట్స్‌(మూర్ఛ) వచ్చి పడిపోయేది. ఫిట్స్‌ ఎందుకొస్తున్నాయో తెలుసుకునేందుకు లిజాను డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా.. మస్తిష్కంలో కొన్ని లోపాల కారణంగా తరచూ మూర్ఛ వస్తుందని, బ్రెయిన్‌ సర్జరీ ద్వారా ఈ సమస్య ను సరిచేయవచ్చని వైద్యులు చెప్పారు. అయితే బ్రెయిన్‌ సర్జరీకయ్యే ఖర్చును భరించే శక్తి లిజా కుటుంబానికి లేదు. దీంతో లిజా తన ఆపరేషన్‌కు తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే లిజా తల్లి నడిపే బేకరీలో సొంతంగా నిమ్మరసం అమ్ముతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది.
యాచించడం కంటే… ఇది మేలు..
‘నీ ఆపరేషన్‌ కు నువ్వే ఎందుకు సంపాదించుకోవాలి?’ అనుకున్నావు అన్న ప్రశ్నకు సమాధానంగా… ‘‘నా లాగా ఆపదలో ఉన్నవారు ఇలా సొంతంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం యాచించడం కంటే కొంతమేలే కదా అని’ చెప్పడం చాలా ముచ్చటేస్తుంది.
సర్జరీ ఖర్చుకు కష్టపడుతున్నా.. లిజా తల్లి ఎలిజబెత్​
‘తండ్రిలేని లిజాను తాను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాననీ, ఆమె వైద్య ఖర్చుల కోసం కష్టపడి డబ్బులు కూడబెడుతున్నానని లిజా తల్లి ఎలిజబెత్‌ చెప్పారు. సర్జరీ, ఇంకా మందులకు చాలానే ఖర్చవుతుంది. అందుకే నేను కూడా ఆన్‌లైన్‌లో దాతల్ని సాయం చేయమని అభ్యర్థించాను. దీంతో లిజా పరిస్థితి తెలిసిన బంధువులు, స్నేహితులు, ఇతర దాతలనుంచి ఇప్పటివరకు మూడు లక్షల డాలర్ల సాయం అందిందని చెప్పారు.

About Author