NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెన్సిల్ కోసం.. పోలీస్ స్టేష‌న్ లో చిన్నారుల `పంచాయ‌తీ` !

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: త‌గాదాలు, పొలం హ‌ద్దు త‌గాదాల‌తో పోలీస్ స్టేష‌న్ కు వెళ్ల‌డం చూశాం. కానీ పెన్సిల్ కోసం పోలీస్ స్టేష‌న్ లో పంచాయ‌తీ పెట్టిన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది.  ఓ చిన్నారి పెన్సిల్ దొంగ‌త‌నం అయింద‌ని.. పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్ట‌మ‌ని పోలీసుల‌ను కోర‌డం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. చిన్నారుల మ‌ధ్య సంభాష‌ణ ఆద్యంతం న‌వ్వులు కురిపిస్తోంది. క‌ర్నూలు జిల్లా పెద్ద‌క‌డ‌బూరు పోలీస్ స్టేష‌న్ లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. హ‌న్మంతు అనే చిన్నారి త‌న స్నేహితుడు పెన్సిల్ దొంగ‌త‌నం చేశాడ‌ని ఆరోపిస్తూ .. స్నేహితుడితో పాటు పోలీసుల వ‌ద్దుకు వెళ్లాడు. త‌న పెన్సిల్ దొంగ‌త‌నం చేసిన స్నేహితుడిపై కేసు పెట్టాలంటూ పోలీసుల‌ను కోరాడు. పోలీసులు చిన్నారుల‌కు స‌ర్దిచెప్పి పంపారు. ఈ దృశ్యాన్ని త‌మ సెల్ ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author