PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలకు.. కార్పొరేట్​ వైద్యం..

1 min read
పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి

ఎమ్మెల్యే పి. రవీంద్ర నాథ్ రెడ్డి
పల్లెవెలుగువెబ్​, చెన్నూరు: పేదలకు కార్పొరేట్​ వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్​ రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక పీహెచ్​సీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. గతంలో పెద్దపెద్ద జబ్బులకు అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు, అలాంటిది నేడు రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కమలాపురం నియోజకవర్గంలో 6 కోట్ల 70 లక్షలతో పనులు చేపట్టామని, ఇందులో చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ( సి హెచ్ సి) కి 4 కోట్ల 70 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆస్పత్రి ఆధునికీకరణతోపాటు వసతులు, మార్చురి, అంబులెన్స్​ షెడ్డులు, రోగుల సహాయకులకు విశ్రాంతి గదులుతోపాటు ఆస్ప్రతికి సామగ్రి కొరత లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ఏపీ ఎం ఎస్ ఐ డి సి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అధికారులు అన్ని పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో, వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కడప మార్కెట్ యార్డు చైర్మన్ జి ఎం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, రా మ న శ్రీ లక్ష్మి రెడ్డి, సర్పంచ్ వెంకటసుబ్బయ్య, వై ఎస్ ఆర్ సి పి మైనార్టీ నాయకులు , అన్వర్ భాష, అబ్దుల్ రబ్, వారిస్, మునీర్ అహ్మద్, హస్రత్, సి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ కృష్ణారెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చెన్నారెడ్డి, తాసిల్దార్ అనురాధ, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author