PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిమాండ్ల సాధన కోసం.. ఉద్యమించిన ఉపాధ్యాయులు

1 min read

– సీపీఎస్ రద్దు చేయాలని .. ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ నిరసన, బహిరంగ సభ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఉపాధ్యాయులు. బుధవారం ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ జి.హృదయ రాజు, రాష్ట్ర ఫ్యాప్టో సెక్రెటరీ కె. ప్రకాశ్ రావు నాయకత్వంలో కర్నూలు జిల్లా పరిషత్ (జెడ్పీ) కార్యాలయం నుండి ఎస్ టి బి సి కాలేజి వరకు వేయి మంది పైగా ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ టి బి సి కళాశాల మైదానంలో FAPTO జిల్లా చైర్మన్ జె.సుధాకర్ అధ్యక్షతన కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా FAPTO రాష్ట్ర కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జి కె.ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో … అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్​ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి… అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీల పేరుతో కాలయాపన చేయడం అన్యాయమన్నారు. అనంతరం APJAC సెక్రెటరీ జనరల్ శ్రీ జి.హృదయ రాజు ప్రసంగిస్తూ సి పి ఎస్ విధానం వలన ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉద్యోగికి ఇచ్చే ఈ పెన్షన్ విధానము వలన వారి జీవితంలో ఖర్చులకు ఏ మాత్రం సరిపోని విధంగా నామమాత్రంగా వుందన్నారు. FAPTO వేదిక CPS అమల్లోకి వచ్చిన 2004 సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వంతో పోరాడుతూ అనేక ఉద్యమాలు చేయటం వలన గత ప్రభుత్వంలో గ్రాట్యుటి, ఫ్యామిలీ పెన్షన్ ను సంపాదించుకోగలిగామని అయితే సి పి ఎస్ రద్దు కొరకు ప్రభుత్వం పై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఆ తరువాత FAPTO కర్నూలు జిల్లా పరిశీలకులు శ్రీ హెచ్.తిమ్మన్న మాట్లాడుతూ FAPTO ఎల్లప్పుడూ ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతుందని.. కానీ ప్రభుత్వంనకు మరి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆ తరువాత యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, డి టి ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీ రత్నం ఏసేపు ,బి టి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఆనంద్ , ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారి , APTF257 జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య, APTF 1938 జిల్లా అధ్యక్షుడు బి.మాధవ స్వామి,కమలాకర రావు ,మహిళా నాయకురాలు శ్రీమతి నాగమణి, ప్రధానోపాధ్యాయుల సంఘము జిల్లా అధ్యక్షుడు శ్రీ ఓంకార్ యాదవ్ మరియు ప్రధాన కార్యదర్శి నారాయణ , అప్టా అధ్యక్షుడు శ్రీ మునగాల మధు సుధన్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ సేవా నాయక్, డి టి ఎఫ్ అధ్యక్షుడు కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ గట్టు తిమ్మప్ప , బి టి ఏ అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు భాస్కర్ మరియు సుధాకర్ యూ టి ఎఫ్ జిల్లా నాయకులు శ్రీ ఎల్లప్ప ప్రసంగించారు.

ఫ్యాప్టో ఉద్యమానికి… మద్దతు..
FAPTO నిర్వహించిన ర్యాలీ మరియు బహిరంగ సభ యందు APNGO నాయకులు వి.జవహర్ లాల్, కృష్ణుడు, ఏపీ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శాంతి భవానీ, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు శ్రీ మద్దిలేటి , RUPP నాయకులు శ్రీ రఘు ,పి ఈ టి అసోసియేషన్ నాయకులు శ్రీ వెంకటేశ్వరులు , CITU నాయకులు శ్రీ గౌస్ దేశాయ్ , AITUC నాయకులు మునెప్ప, ఎన్జీవో వెటర్నరీ ఉద్యోగుల సంఘ నాయకులు సుబ్బారాయుడు పాల్గొని తమ యొక్క మద్దతు మరియు సంఘీభావం ప్రకటించారు. సభ అనంతరం నాయకులు అందరూ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి సి పి ఎస్ రద్దు కోరుతూ మెమొరాండం సమర్పించారు.

About Author