PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గులాబీ రంగు పురుగు నివారణకు  లింగాకర్షక  బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి.

1 min read

– ప్రత్తి పంట లో క్షేత్ర సందర్శన.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు, డా. ఎస్. సరలమ్మ, డా. ఎ.రామకృష్ణ రావ్, డి.అర్.సి, వ్యవసాయ అధికారి, ప్రభవతమ్మ,ఆర్.బి.కె. వి.ఏ.ఏ దాసు, మౌనిక, హేమలత కలిసి  ‘నందికొట్కూరు’ మండలం లోని ‘దామ గట్ల’ మరియు ‘నందికొట్కూరు’ గ్రామలలో ‘పత్తి పంట’లో క్షేత్ర సందర్శన చేశారు. ప్రస్తుతం రసం పీల్చు పురుగులు ( పచ్చ దోమ, తామర పురుగులు) మరియు మెగ్నీషియం దాతు లోపాలు ఆశించి నష్టం కలుగ చేస్తున్నట్లు గమనించడంజరిగింది. రసం పీల్చుపురుగుల నివారణకు  డా. ఎస్. సరలమ్మ, డా.ఏ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ లు  రైతులకు  వ్యవసాయ సూచనలు  తెలియజేశారు.  వేపనూనె  2 మి. లి./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని మరియు ఎకరానికి  10 నుంచి 20 పసుపు, నీలి రంగు జిగురు  అట్టలను పొలంలో పెట్టుకోవాలి.అవసరాన్ని బట్టి రసాయన పురుగుమందులయిన ఇమిడాక్లోప్రిడ్ 0.4మి.లీ/లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా/లీ లేదా దయోమిధాక్జమ్ 0.2గ్రా/లీ కలిపి పిచికారీ చేసుకోవలెను.  మెగ్నీషియం  ధాతు లోప నివారణకు 10 గ్రాముల ‘మెగ్నీషియం సల్ఫేట్’ లీటరు నీటికి 10 రోజుల వ్యవధిలో  రెండుసార్లు పిచికారి చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం  జరిగింది. గులాబీ రంగు పురుగు నివారణకు గాను లింగా కర్షక బట్టలు ఏకరానికి 20 చెప్పున పెట్టుకోవాలని రైతులకు సూచించారు.

About Author