ఆ కంపెనీలకు రూ. 19 వేల కోట్ల నష్టం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇంధన విక్రయ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. నాలుగున్నర నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా కొనసాగించడంతో ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలు భారీగా నష్టపోయాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంటోంది. అంతర్జాతీయ మార్కె ట్లో భారీగా పెరుగుతూ వచ్చిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధన రేట్లను పెంచని కారణంగా ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆదాయానికి దాదాపురూ.19,000 కోట్లు మేర గండిపడిందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం లో మూడు కంపెనీల మొత్తం నికర రాబడిలో 20 శాతానికి ఇది సమానమని పేర్కొంది.