NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ ఉద్యోగుల‌కు.. ఏడాదికి 3 నెల‌ల సెల‌వులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అన్ని సాయుధ బ‌ల‌గాల సిబ్బందికి సంవ‌త్సరంలో 3 నెల‌ల‌పాటు కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపేందుకు సెల‌వులు మంజూరు చేయాల‌న్న ప్రతిపాద‌న‌పై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో, స‌మ‌స్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల‌కు ఏడాదిలో 3 నెల‌లు సెల‌వులు మంజూరు చేయాల‌న్న ప్రతిపాద‌న‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేశారు. ఈ ప్రతిపాద‌న 2019 అక్టోబ‌ర్ అమిత్ షా ప్రతిపాదించారు. దీనిని అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన సాఫ్ట్ వేర్ రూప‌క‌ల్పన ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో తెల‌పాల‌ని ఆయా విభాగాల‌ను హోంశాఖ తాజాగా ఆదేశించింది. ప్రస్తుతం రెండు విభాగాల‌కు సంబంధించిన సాఫ్ట్ వేర్ మాత్రమే సిద్ధమైన‌ట్టు స‌మాచారం.

About Author