లక్ష పెట్టుబడి పెట్టిన వారికి.. రూ. 3.97 కోట్ల లాభం !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచంలో టాప్ 3 ఏపీఐ కంపెనీల్లో ఒకటిగా, హైదరాబాద్‌లో టాప్ ఏపీఐ కంపెనీగా ఉన్న దివీస్ ల్యాబోరేటరీస్ తన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. తన కంపెనీలో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేసింది. దివీస్ కంపెనీలో డబ్బులు పెట్టి.. 19 ఏళ్ల పాటు వేచిచూసిన ఇన్వెస్టర్లకు ఈ కాసుల వర్షం కురిసింది. సోమవారం దివీస్ ల్యాబోరేటరీస్ కంపెనీ షేరు ధర ఎన్‌ఎస్ఈలో రూ.3,578 వద్ద క్లోజైంది. అయితే మార్చి 13, 2003న ఈ స్టాక్ ధర చూసుకుంటే కేవలం రూ.9 మాత్రమే. అంటే అప్పట్లో పెన్నీ స్టాక్‌లలో ఇది ఒకటి. అప్పటి ఈ పెన్నీ స్టాక్.. నేడు కోట్లకు కోట్ల లాభం అందించింది. 19 ఏళ్ల క్రితం ఎవరైతే దివీస్ ల్యాబోరేటరీస్ కంపెనీలో లక్ష రూపాయలను ఇన్వెస్ట్ చేసి ఉంటారో.. వారి పెట్టుబడుల వాల్యూ ప్రస్తుతం రూ.3.97 కోట్లు. కానీ కంపెనీ జూలై 30, 2009 నాడు ఒక షేరుకి మరో షేరును బోనస్‌గా అందించింది. అంటే రూ.9 షేరు ధర వద్ద లక్ష రూపాయల పెట్టుబడితో 11,111 షేర్లను కొన్న వారికి.. మొత్తం షేర్ల సంఖ్య 22,222కి పెరిగింది.