PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగ్గురికి..వినికిడి యంత్రాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు :విభిన్న ప్రతిభావంతులను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ సూచించారు. బుధవారం విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుర్తించి ఎంపిక చేసిన ముగ్గురికి శ్రవణ యంత్రాలను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పంపిణీ చేశారు. శ్రవణ యంత్రాలు పంపిణీలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడి విజయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author