PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైరస్​ కట్టడికి.. సహకరిద్దాం..

1 min read
ప్రజలకు మాస్కులు అందజేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

ప్రజలకు మాస్కులు అందజేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

– ముందు జాగ్రత్తలు పాటిద్దాం..
– ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, క్రైం: కరోనా వైరస్​ నియంత్రణకు పూర్తిస్థాయిలో సహకరించి.. కట్టడి చేద్దామని ఎస్పీ డా. కాగినెల్లి ఫక్కీరప్ప పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని రాజ్​ విహార్​ సర్కిల్​లో ప్రజలకు మాస్కులు అందజేసి.. వైరస్​ నియంత్రణపైఅవగాహన కల్పించారు. కోవిడ్​ కట్టడికి సహకరిద్దామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. బాధ్యతగల పౌరుడిగా కరోనా నివారణకు మాస్కులు ధరిస్తామని, బౌతిక దూరం పాటిస్తామని, చేతులు సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా ఉంచుకుంటామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు రెండో రోజు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించామని, జిల్లాలో 82పోలీస్​ స్టేషన్లలో స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించామన్నారు. కర్నూలు కేసులు తక్కువగా నమోదవుతున్నాయని, కొందరి నిర్లక్ష్యం కారణంగా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు పట్టణ సిఐలు పార్ధసారిథి రెడ్డి, కళావెంకటరమణ, శ్రీనివాస రెడ్డి, తబ్రేజ్, మరియు ఎస్సైలు ఉన్నారు.

About Author