PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు !

1 min read

పల్లెవెలుగువెబ్ : వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమల దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి భక్తులకు తెలిపింది. పలువురు భక్తులు నెగిటివ్‌ సర్టిఫికెట్‌ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల అనేక మంది భక్తులు ఇబ్బందికి గురవుతున్నారు.

         

About Author