అటవీ సంపదకు నష్టం కలిగిస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు
1 min read- అటవికి నష్టం కలిగించిన కేసులో 9 మందికి జైలు శిక్ష
- అటవీ శాఖ ఏలూరు రేంజ్ అధికారి ఎస్ వి కె కుమార్
పల్లె వెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి: అడవికి నష్టం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ ఏలూరు రేంజి అధికారి ఎస్.వి.కె. కుమార్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా , టి. నరసాపురం మండలం, అల్లంచెర్లరాజుపాలెం గ్రామం లో ఉన్న అటవీ భూమిని కొంత మంది కొత్తగూడెం మరియు కామవరపుకోట గ్రామాలకు చెందిన ధళారులు స్థానిక గ్రామస్తులను అనగా అల్లంచెర్ల, కొత్తగూడెం, మంకినపల్లి, కొండగూడెం, కామవరపుకోట ప్రజలను ఉసిగొల్పి ఈనెల 3వ తేదీన 1. కరిపోతు వీరయ్య తండ్రి . వెంకన్న 2.సిరిసెట్టి యేసు తండ్రి . సూరి 3. అడవికొట్టు మురళి తండ్రి. చంటియ్య 4.అడవికొట్టు సురేష్ తండ్రి. చంటియ్య 5. సిరిసెట్టి వేంకటేశ్వర రావు తండ్రి . వెంకటరత్నం 6.దాసరి వేంకటేశ్వర రావు తండ్రి . దుర్గారావు 7.ఆడమిల్లి గంగరాజు తండ్రి . పెద సూర్యం 8.ఆడమిల్లి రామారావు తండ్రి . చిన వెంకన్న 9.ఆడమిల్లి మంగయ్య తండ్రి . సుబ్బారావు అక్రమముగా రక్షిత అటవీ ప్రాంతం లో ప్రవేశించి అడవికి నష్టము కలిగించియున్నరని, . వారిని అడ్డగించి, అదుపులో తీసుకొని, గౌరవ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్ ) చింతలపూడి వారి ఎదుట హాజరు పరచగా, నిందితులకు (14) రోజులు రిమాండ్ విధించగా, వారిని జిల్లా జైలు, ఏలూరునకు తరలించడమైనదన్నారు. ప్రజలు ఎవరైనా , అక్రమముగా అడవిలో ప్రవేశించి, అడవికి నష్టము అనగా , అడవిని నరుకుట, నిప్పుపెట్టుట లేదా ఇతర కార్యకలాపములు చేసిన యెడల అటవీ చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడునని కుమార్ హెచ్చరించారు.