వైద్య సేవల్ని మరిచి.. మద్యం అమ్మకాల పై దృష్టి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. కరోన సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి, వైద్య సేవల్ని ఎలా మెరుగుపరచాలి అన్న ఆలోచన లేకుండా.. కేవలం మద్యం అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరైంది కాదని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలను మరో గంట పాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ అనాలోచిత చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో పాక్షిక నిషేధాలు అమలైనప్పటికీ.. పాఠశాలల తరగతులు నిర్వహించడం సరికాదన్నారు. కరోన తగ్గే వరకు తరగతులు వాయిదా వేయాలని కోరారు.