ఏపీజేఏసీ అమరావతి.. కర్నూలు జిల్లా డివిజన్ కమిటీల ఏర్పాటు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/14-9.jpg?fit=550%2C212&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా బలోపేతం లో భాగంగా జిల్లా మరియు డివిజన్ కమిటీల ఏర్పాటు జరిగింది. ఈరోజు అంటే 12.2.25న కర్నూలు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో రాష్ట్ర మహిళా విభాగం చైర్‌పర్సన్ పారె లక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ జనరల్ కె. విజయ లక్ష్మి , ఏపిజేఏసి అమరావతి జిల్లా చైర్మన్ K.Y.కృష్ణ మరియు APJAC అమరావతి కర్నూలు GS లక్ష్మీరాజు నాయకత్వంలో నిర్వహించారు. కర్నూలు జిల్లాలో జిల్లా చైర్ పర్సన్ కొ అప్షన్ లో శ్రీమతి సైరాభాను ని చైర్ పర్సన్ గా, అసోసియేట్ చైర్‌పర్సన్ శ్రీమతి మల్లేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి గా, శ్రీమతి పద్మావతి, కో చైర్మన్, గా కె.శివపార్వతి ని , జిల్లా కోశాధికారి గా శ్రీమతి కార్తీకలక్ష్మి ని కోఆప్షన్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా , APRSA జిల్లా అధ్యక్షులు, శ్రీ.నాగరాజు, సహ ఛైర్మన్, మద్దిలేటి, క్లాస్ IV ఉద్యోగుల సంఘం, ఏపిజేఏసి అమరావతి కో చైర్మన్ శ్రీ.శ్రీనివాసులు, పిటిడి & డా.అనీష్ లక్ష్మణ్, ఏహెచ్ డిపార్ట్మెంట్ మరియు వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన మహిళా ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/141-4.jpg?resize=550%2C227&ssl=1)