త్వరలో జిల్లా పర్యటన కమిటీల ఏర్పాటు….
1 min read
జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ ఖాజా హుస్సేన్
పల్లెవెలుగు, కర్నూలు: త్వరలో కర్నూలు జిల్లా లోని నియోజకవర్గాల పర్యటన ఉంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ ఖాజా హుస్సేన్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలుపుతూ మైనార్టీల లో చైతన్యం తీసుకొచ్చేందుకు నియోజకవర్గాల వారీగా పర్యటన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం మైనార్టీలకు అందించే సంక్షేమ పథకాలు మైనార్టీలకు సక్రమంగా అందించేందుకు మైనార్టీ సెల్ కృషి చేస్తుందని అని తెలిపారు. నియోజకవర్గాల కమిటీలను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గాల వారిగా పర్యటించి మైనార్టీలను చైతన్యం కలిగించే వారిని, పార్టీని బలోపేతం చేసినందుకు కృషి చేసే వారిని ఇన్చార్జిలుగా నియమిస్తానని అని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని లేని పక్షంలో నిరసనలు దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉర్దూ యూనివర్సిటీ ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించబోతున్నామని అని తెలిపారు. 2019లో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఆశించినంత అభివృద్ధి జరగలేదని, గత ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయలేదని ఆయన విమర్శించారు. నిర్మాణాలలో వేగం పుంజు కోవాలని ఈ బడ్జెట్లో కనీసం 50 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ యూనివర్సిటీకి ఆటంకం కలగడం సరికాదన్నారు. అదేవిధంగా నగరంలో ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర కాలేజీని మార్పు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొత్త బస్టాండ్ సమీపంలో కాలేజీ మార్చడం వల్ల కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.