కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ నూతన కమిటీ ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఏలూరు జిల్లా యందు నుతన కమిటీ సభ్యుల నియామకం జరిగినది. ఈ కమిటీలో నియమితులైన సభ్యులు అందరు నీతి సమాజంలో ఏదో ఒక విషయంలో అనగా వస్తువులు నాన్యాతాలోపం, ఆహార పదార్థాలు కలషితం మరియు సేవా లోపం వలన జరిగే వివిధ రకాలుగా నష్టపోతున్న వినియోగదారునికి ఉచితంగా సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చారు. ఈ కారక్రమంలో సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ పెంజుర్తి రవికిరణ్ పాల్గొని కమిటీ సభ్యులకు నియామక పత్రాలను మరియు ఐడి కార్డులను అందజేసారు. ఈ సమావేశంలో పాల్గొన్న పాతూరి రామరాజు ( నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ) నేడు సమాజంలో జరిగే వివిధ కలుషితమైన ఆహారాన్ని నియంత్రించాలని తెలిపారు. ఏలూరు జిల్లా ఇన్చార్జి కోరాడ నరసింహారావు మాట్లాడుతూ ప్రతి వస్తువును నాణ్యత లోపం కలిగి ఉందని వాటిని అరికట్టాలని తెలియజేశారు. జిల్లా ప్రెసిడెంట్ స్వామిదాస్ మాట్లాడుతూ సేవాలోపం అనేది ప్రతి దానిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ దాసరి మోజెస్, జిల్లా సెక్రటరీ ధర్మవరుపు దుర్గారావు మాట్లాడుతూ జిల్లా కమిటీ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క వినియోగదారునికి సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలోస్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెలమర్తి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలంబాబు, పిఆర్వో శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.