PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాచినాయపల్లె లో 7.74 లక్షలతో ఫార్మేషన్ రోడ్డు : ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు రైతులు పండించిన ధాన్యాన్ని, అలాగే వరిగడ్డి వంటి వాటిని ఎడ్లబండ్లతో, అదేవిధంగా ట్రాక్టర్లతో, తో లుకునేందుకు వీలుగా రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుందని కమలాపురం శాసనసభ్యులు పి.రవీంద్రనాథ రెడ్డి అన్నారు.  సోమవారం ఉదయం   మండలం లోని రాచినయా పల్లి గ్రామ పంచాయితీ నందు గల పొలాలలో పార్మేశన్ రోడ్డు పనులకు ఆయన భూమీ పూజ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి, అదేవిధంగా రైతులు పండించిన పంట ఇంటికి చేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 7 లక్షల 73 వేల 841 రూపాయలతో ఫార్మేషన్ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, గతంలో రైతులు తమ పొలాల వద్ద కు ఎడ్లబండ్లు పోవాలన్న, ట్రాక్టర్లు పోవాలన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తకుండా రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ ఫార్మేషన్ రోడ్డు తొమ్మిది వందల యాభై మీటర్ల వరకు ఉంటుందని  ఉపాధి కూలీలు ఈ పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు, దాదాపు ఈ పనుల నిమిత్తం ఉపాధి కూలీలకు 13 వందల 55 పని దినాలు కేటాయించడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా సీమ బాబు, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, జెడ్ పి టి సి ముది రెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చి ర్ల సురేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు ఆర్ ఎస్ ఆర్, ఎంపీటీసీలు ముది రెడ్డి సుబ్బారెడ్డి, దుంప నాగిరెడ్డి, రఘురాం రెడ్డి, సర్పంచులు సొంట్టం నారాయణ రెడ్డి, తుంగా చంద్రశేఖర యాదవ్, సుదర్శన్ రెడ్డి, ఉప సర్పంచ్ పుత్త వేణుగోపాల్ రెడ్డి, సిద్ధవటం సుబ్బారెడ్డి, రమేష్, రాజగోపాల్ , శేఖర్, పి సి కేశవరెడ్డి, అన్వేష్ రెడ్డి, ఏ పి డి సోమశేఖర్ రెడ్డి, ఏ పీ ఓ ,సుధారాణి, ఈ సి శిరీష, కార్యదర్శి గురు వే శ్వర్ రావు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

About Author