మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు భద్రత లేదని చెప్పడం సిగ్గు చేటు
1 min read
రాప్తాడు పర్యటన లో జగన్ కు ప్రభుత్వం అన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది
జగన్ అసత్య ప్రచారాలను మానుకోవాలి…
మీడియా సమావేశంలో ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ నేడు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత సరిగా కల్పించడం లేదని చెప్పడం సిగ్గుచేటని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు… ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన భద్రత సరిగా లేదని పోలీసులను విమర్శలు చేయడం సరికాదన్నారు. అసత్య ప్రచారాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని ఎంపీ హితవుపలికారు. గత ప్రభుత్వంలో ప్రతి పక్ష నాయకులకు ఎలాంటి భద్రత కల్పించలేదని… ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకట రాముడు టీడీపీ నాయకులు వలి, దేవ శంకర్ , నాగేష్ తదితరులు పాల్గొన్నారు.