PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరిగిన జీన్స్ పై మాజీ ముఖ్య‌మంత్రి అభ్యంతరం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిరిగిన జీన్స్ ధరించడం భారతీయ సంస్కృతిలో భాగం కాదంటూ తీరత్ సింగ్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరిగిన జీన్స్ ధరించే మహిళలపై తీరత్ సింగ్ వ్యాఖ్యలు చేసి గత ఏడాది తీవ్ర దుమారం రేపారు. ఈ అంశంపై తాను గతంలో చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నానని యాదవ్ చెప్పారు.2021వ సంవత్సరం మార్చిలో తీరత్ సింగ్ యాదవ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత యువతులు వింత ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. చిరిగిన జీన్స్,బూట్లు ధరించి ఉన్న ఓ తల్లిని చూసి తాను షాక్ అయ్యానని సింగ్ పేర్కొన్నారు.

                              

About Author