వ్యాపారంలోకి మాజీ సీఎం తనయుడు.. రాందేవ్ బాబాకు పోటీనా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : రాజకీయాల్లో చురుకుగా ఉన్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. లాలూ అండ్ రబ్రీ (ఎల్అండ్ఆర్ ) పేరుతో అగరబత్తుల తయారీ కంపెనీ ప్రారంభించాడు. దేశ వ్యాప్తంగా ఈ అగరబత్తులు అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ పశుల దాణ ఉత్పత్తి షెడ్డులో ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్టు తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. దేవాలయాల్లోని పూలను సేకరించి.. సేంద్రియ పదార్థాలు, సుగంధ ద్రవ్యాల నూనెల సహాయంతో అగరబత్తులను తయారు చేస్తారు. వీటికి కృష్ణలీలా అగర్ బత్తి, బన్సారా, అగర్ బత్తి, సేవాకుంజ్ అగర్ బత్తీలని తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు పెట్టారు. అగరబత్తీల కర్మాగారాన్ని తేజ్ ప్రతాప్ యాదవ్ తన మొబైల్ ద్వార పర్యవేక్షిస్తారని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. తేజ్ ప్రతాప్ అగర్ బత్తీల వ్యాపారంలోకి ప్రవేశిచండంతో రాందేవ్ బాబాకు పోటీ ఇస్తారని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు.