NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిన్న మాజీ సీఎస్.. నేడు ఆయ‌న భార్య మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కుటుంబంలో విషాదం నెల‌కొంది. 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే భార్య భ‌ర్తలు క‌రోన కాటుకు బ‌ల‌య్యారు. క‌రోన‌తో ఎస్వీ ప్రసాద్ నిన్న మృతి చెందారు. సోమాజీ గూడ‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న భార్య ల‌క్ష్మి వేకువ‌జామున 3 గంట‌ల‌కు మ‌ర‌ణించారు. కొన్న రోజుల క్రితం భార్యభ‌ర్తలిద్దరూ సోమాజీగూడ ఆస్పత్రిలో క‌రోన చికిత్స కోసం చేరారు. ఆ త‌ర్వాత వారి ఇద్దరు కుమారులు కూడ క‌రోన బారిన ప‌డి అదే ఆస్పత్రిలో చేరారు. ప‌రిస్థితి విషమించ‌డంతో మంగ‌ళ‌వారం ఎస్వీ ప్రసాద్, బుధ‌వారం ఆయ‌న భార్య ల‌క్ష్మి మృతి చెందారు. వారి కుమారుల ఆరోగ్యం నిల‌కడ‌గా ఉంద‌ని వైద్యులు చెప్పారు.

About Author