NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెళ్లి పీట‌లు ఎక్కనున్న మాజీ ఉప ముఖ్యమంత్రి !

1 min read

పల్లెవెలుగు వెబ్​: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాద‌వ్ త‌న‌యుడు తేజ‌స్వీ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. లాలూ సంతానంలో తేజ‌స్వీ చివ‌రివాడు. ప్రస్తుతం బీహార్ ప్రతిప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్నారు. గ‌తంలో బీహార్ ఉప‌ముఖ్యమంత్రిగా ప‌నిచేశారు. తేజ‌స్వీ వివాహ విష‌యాన్ని ఆయ‌న సోద‌రి రోహిణ ఆచార్య ట్విట్టర్ లో వెల్లడించారు. త‌న సోద‌రుడు త్వర‌లో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, త‌మ ఇళ్లంతా ఆనందంతో నిండిపోయింద‌ని ఆమె చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి కూతురు వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు. ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. పెళ్లి కోసం ఇప్పటికే లాలూ కుటుంబం ఢిల్లీ చేర‌కున్నట్టు స‌మాచారం. కొద్దిమంది బంధువుల స‌మ‌క్షంలోనే ఈ పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది.

About Author