NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ పై పోటీకి సై అంటున్న మాజీ నేత !

1 min read
   ప‌ల్లెవెలుగువెబ్ :  తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ పోటీకి సై అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పోటీకి దిగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీదే అధికార‌మ‌ని జోస్యం చెప్పారు. మెజార్టీ టీఆర్ఎస్ నేత‌లు బీజేపీతో ట‌చ్ లోఉన్నార‌ని చెప్పారు. టీఆర్ఎస్ కు భ‌విష్య‌త్ లేద‌ని అక్క‌డి నేత‌లే అంటున్నార‌ని ఈటెల అన్నారు. థ‌ర్డ్ ఫ్రంట్ సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి సొంత పార్టీని కాపాడుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్తాన‌ని కేసీఆర్ ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఆరోపించారు. త‌న‌కు బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ తో ఎలాంటి విబేదాలు లేవ‌ని తేల్చిచెప్పారు.


                 

About Author